Thursday, August 5, 2010

ఓ నా నేస్తమా .....

ఓ నా నేస్తమా ......
నీ కోసం నీలి నింగిని సైతం చేరుకుంటాను
సప్త సాగరాల సైతం ఈదుతాను
వేయి జన్మల సైతం వేచి యుంటాను
నీ ప్రేమ కోసం నా ప్రాణం ఐనను
పాదార్పణం చేస్తాను .

గమ్యం లేని నావకు నావికుడిని
లక్ష్యం లేని జీవితాన్ని రక్షిస్తావ.......

నీతో ఏదో చెప్పాలని

నీతో ఏదో చెప్పాలనుంది
మనసు విప్పి మాట్లాడాలనివుంది

గుండెల్లో ఏదో తెలియని ఆరాటం
మనసులో ఏదో తెలియని కలవరం

అనుక్షణం నీవే గుర్తుకోస్తున్నావు
నా ఊహల్లో నిదురిస్తున్నావు

ఎందుకో నిన్ను చేరాలనే తపన
పెరుగుతోంది రోజు రోజుకి నాలో ఆవేదన

ప్రియా .........

నీకు నీవుగా నన్ను చేరుకోలేవ ?
నీ ప్రేమ మడుర్యాన్ని నాకు కాస్త పంచి పెట్టలేవ ?